ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPS officers: ఆలోచించి ఓటు వేయండి

ABN, First Publish Date - 2023-11-29T10:36:15+05:30

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుని

- ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి

- మంచివాళ్ల మౌనమే ప్రమాదకరం

- ఓటు హక్కు వినియోగంపై ఐపీఎస్‏లు

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుని ఆలోచించి ఓటువేసి సరైన అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మనతోపాటు.. రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను, అభివృద్ధిని నిర్ణయించేది మనం వేసే ఓటు మాత్రమే. ఈ నేపథ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర పై కొందరు ఐపీఎస్‌ అధికారులు ఏమంటున్నారంటే..

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి)

ఓటు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పండగను జరుపుకోవాలి. ఇటీవల అంబర్‌పేటలో సీపీఎల్‌ మైదానంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఎన్నికల్లో ఓటు వేసి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. ప్రజా స్వామ్యాన్ని గెలిపించాలి.

- సందీప్‌ శాండిల్య, హైదరాబాద్‌ సీపీ

ఓటు వజ్రాయుధం

ఓటు వజ్రాయుధం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఓటు వేసే హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉంది. సరైన అభ్యర్థిని ఎన్నుకొని భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉంటుంది.

- డీఎస్‌ చౌహాన్‌, రాచకొండ సీపీ

యువత ముందుకు రావాలి..

ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. యువత ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ

మహిళలు ముందుకు రావాలి..

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. అది అందరి బాధ్యత. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ముందుకొచ్చి ఓటు వేయాలి. సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మన పిల్లల భవిష్యత్తు, సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర అనే విషయం గుర్తుంచుకోవాలి.

- కవిత, ఉమెన్‌ సేప్టీ డీసీపీ, హైదరాబాద్‌

మంచివాళ్ల మౌనం దేశానికి ప్రమాదం..

మంచివాళ్ల మౌనం దేశానికి, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి వల్ల కాదు.. మంచివారు మౌనంగా ఉండటం వల్ల. చెడ్డవాళ్లకు చెక్‌ పెట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. ఓటు అనే వజ్రాయుధంతో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలి.

- శిల్పవల్లి, డీసీపీ సీసీఎస్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-11-29T10:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising