చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-06-04T00:24:38+05:30 IST

వర్షాలు ప్రారంభం అయ్యేలోగా జిల్లాలోని మానేరు, మూలవాగుపై నిర్మాణంలో ఉన్న అన్ని చెక్‌ డ్యామ్‌లను పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 3: వర్షాలు ప్రారంభం అయ్యేలోగా జిల్లాలోని మానేరు, మూలవాగుపై నిర్మాణంలో ఉన్న అన్ని చెక్‌ డ్యామ్‌లను పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మానేరు వాగుపైన ఎగువ మానేరు, మిడ్‌ మానేరు మధ్య 11, మూలవాగుపై 13 చెక్‌ డ్యామ్‌లతో కలిపి మొత్తం 24చెక్‌ డ్యామ్‌ లను 155 కోట్ల రూపాయలతో చేపట్టారు. మానేరుపై చేపట్టిన చెక్‌ డాం నిర్మాణ పనులను ఇరిగేషన్‌, ఇంజనీర్‌లు పర్యవేక్షిస్తుండగా మూలవాగుపై చేపట్టిన చెక్‌ డ్యామ్‌ పనులను ప్యాకేజీ - 9 ఇంజనీర్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో 7 చెక్‌ డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. 13 చెక్‌ డ్యాం పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌ లో వీటి నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి రెండు విభాగాల కార్యనిర్వహక , ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌లతో సమీక్షించారు. పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఇరిగేషన్‌ కార్య నిర్వాహక ఇంజనీర్‌ అమరేందర్‌ రెడ్డి, ప్యాకేజీ 9 కార్యనిర్వాహక ఇంజనీరింగ్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అనంతరం ఈనెల 7న నిర్వహించనున్న నీటిపారుదల దినోత్సవం ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, జిల్లా పౌరసంబంధం అధికారి మామిండ్ల దశరథం పాల్గొన్నారు

Updated Date - 2023-06-04T00:24:38+05:30 IST