ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharmapuri Election Issue: ఇంకా దొరకని స్ట్రాంగ్ రూమ్ తాళాలు.. కలెక్టర్ ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-04-10T16:42:00+05:30

జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు ఇంకా తెరుచుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జగిత్యాల: జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ (EVM Storng Room)లు ఇంకా తెరుచుకోలేదు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఇప్పటికి దొరకని పరిస్థితి. మూడు స్ట్రాంగ్ రూమ్‌ల్లో కేవలం ఒక గది తాళాలను మాత్రమే అధికారులు తెరిచారు. మిగిలిన రెండు గదుల తాళాలు దొరకకపోవడంతో అధికారులు అయోమయంలో ఉండిపోయారు. తాళాలు దొరకకపోవడంపై కలెక్టర్ యాస్మిన్ భాషా మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడు స్ట్రాంగ్ రూమ్‌లలో ఒక గది తాళం మాత్రమే అధికారులు తీశారన్నారు. మిగితా రెండు గదుల తాళాలు తెరుచుకోలేదని తెలిపారు. తెరిచిన గదిలో కావాల్సిన పత్రాలు లేక అయోమయం పరిస్థితి ఏర్పడిందని... ఇదే విషయాన్ని కోర్టుకు నివేదిస్తామని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని కలెక్టర్ యాస్మిన్ వెల్లడించారు.

తాళాలు కావాలనే మిస్ చేశారు: లక్ష్మణ్

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు కావాలనే మిస్ చేశారని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. నాలుగున్నర ఏళ్ళుగా తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కావాలనే కొప్పుల ఈశ్వర్ కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా... గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల చెల్లదంటూ ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. 2018లో అక్రమంగా కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఇవాళ స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ తెరిచేందుకు వెళ్లారు. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరిచారు. అనంతరం అందులోని కీలక డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈరోజు ఉదయం కలెక్టర్ యాస్మిన్ భాషా స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచేందుకు కాలేజీకి చేరుకున్నారు. ఈక్రమంలో ఈవీఎంలు భద్రపరిచిన కాలేజీలో తేనెతుట్టె కదిలింది. దాంతో భవనంలో ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అధికారులు, వివిధ పార్టీల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి పరుగుతీశారు.

Updated Date - 2023-04-10T16:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising