ఘనంగా రథ సప్తమి వేడుకలు

ABN , First Publish Date - 2023-01-29T00:43:29+05:30 IST

ధర్మపురి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలు శనివా రం ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడి జన్మదినం పురస్కరిం చుకుని భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు.

ఘనంగా రథ సప్తమి వేడుకలు
స్వామి వారికి అభిషేకాది పూజలు నిర్వహిస్తున్న అర్చకుల

నరసింహుడిని దర్శించుకున్న భక్తులు

ధర్మపురి, జనవరి 28: ధర్మపురి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలు శనివా రం ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడి జన్మదినం పురస్కరిం చుకుని భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. సూర్య భగవానుడికి ఆర్గ్యం వదిలారు. గోదావరి నది స్నానఘట్టాల వద్ద సైకత లిం గాలు ఏర్పాటు చేసి జలంతో అభిషేకం జరిపి పూజించారు. గోదావరి మా తకు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. స్థానిక శ్రీ లక్ష్మీ నృసిం హ స్వామి, అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలను భక్తులు సందర్శించారు. వివిధ రకాల పూజలు జరిపి స్వామి వారలను దర్శనం చేసుకున్నారు.

నరసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. భారీ గా తరలి వచ్చిన భక్తులు లక్ష్మీ నరసింహ స్వామి, అనుబంధ ఆలయాల్లో స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఆలయాల్లో అందంగా పూలతో అలంకరణ చేసిన స్వామి వారలకు వేదపండితులు బొజ్జ రమేష్‌ శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ మంత్రోచ్ఛారణల మధ్య ము ఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, రమణాచారి, నరసింహ మూర్తి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, అర్చకు లు, సిబ్బంది భక్తులకు తగు సేవలు అందించారు. ధర్మపురి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు, అర్చకు లు, సిబ్బంది పాల్గొన్నారు.

కొండగట్టులో భక్తుల రద్దీ

మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధానం శనివారం భక్తులతో రద్దీగా మారింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భేతాళుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకున్నారు. ఆల యంలో అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

ఫహైదరాబాద్‌కు చెందిన ఆర్‌.ఎన్‌. జయపాల్‌రెడ్డి అనే భక్తుడు ఆంజ నేయస్వామి దేవస్థానానికి రూ.లక్ష విరాళం అందించారు. ఈ మేరకు నగదును ఆలయ పర్యవేక్షకులు సునీల్‌కు అందజేశారు. ఆలయ సిబ్బంది సంపత్‌, సుధాకర్‌రెడ్డి ఉన్నారు

Updated Date - 2023-01-29T00:43:31+05:30 IST