ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి రెండు కొత్త పథకాలు..

ABN, First Publish Date - 2023-11-27T12:26:10+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువుండడంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు కొత్త పథకాలు తీసుకువస్తున్నామని చెప్పారు.

పెద్దపల్లి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి (Telangana Assembly Election Campaign) ఇంకా రెండు రోజులే గడువుండడంతో బీఆర్ఎస్ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డు (Ration Card) ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు కొత్త పథకాలు తీసుకువస్తున్నామని చెప్పారు. ఒకటి సన్నబియ్యం, రెండోది రూ. ఐదు లక్షల కేసీఆర్ (KCR) జీవిత బీమా.. ఈ రెండు పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అసైన్డు భూములు (Assigned Lands) ఉన్నవారికి మంత్రి శుభవార్త చెప్పారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డు భూములు ఉన్నప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి యాజమాన్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణను నాసనం చేసిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి మళ్లీ అవకాశం ఇస్తే కరెంట్ కట్ అవుతుందని, రైతు బంధు ఆగిపోతుందని, ప్రజల జీవితాలు నాశనమవుతాయి తప్పా.. ఆ పార్టీవల్ల ఏమీకాదని మంత్రి కేటీఆర్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పొరపాటున కూడా కాంగ్రెస్‌ను నమ్మొద్దన్నారు. అదీ.. ఇదీ గ్యారంటీ అంటూ కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారని, వాళ్ల సీఎం సీటుకే గ్యారంటీలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఆరు నెలలకొకసారి ముఖ్యమంత్రులు మారడం గ్యారంటీ అని అన్నారు. రైతు బంధు ఆపిన పార్టీకి ఓటేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-11-27T12:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising