ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: రామగుండంలో బీఆర్‌ఎస్‌కు షాక్

ABN, First Publish Date - 2023-10-03T11:56:56+05:30

: రామగుండంలో అధికార పార్టీ బీఆర్‌ఎస‌కు గట్టి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చందర్ తమ కాళ్ళు పట్టుకున్నారన్నారు. కోరుకంటి చందర్‌ను 2018 లో చందాలు వేసుకొని గెలిపించామని చెప్పుకొచ్చారు.

పెద్దపల్లి: రామగుండంలో అధికార పార్టీ బీఆర్‌ఎస‌కు (BRS) గట్టి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి (Palakurti ZPTC Kandula Sandhyarani) బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై (MLA Korukanti Chandar) సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చందర్ తమ కాళ్ళు పట్టుకున్నారన్నారు. కోరుకంటి చందర్‌ను 2018 లో చందాలు వేసుకొని గెలిపించామని చెప్పుకొచ్చారు. చందర్ గెలిచిన తర్వాత రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ బూడిద, ఇసుక, ఉద్యోగాలలో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. 20 ఏళ్లుగా తనను అవమానపరస్తున్నారంటూ సంధ్యారాణి కంటతడిపెట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. కొంగు చాపి అడుగుతున్న రామగుండం ప్రజలు అవకాశం ఇవ్వాలని సంధ్యారాణి కోరారు.

Updated Date - 2023-10-03T11:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising