గ్రామాల స్వరూపాన్ని మార్చిన ‘పల్లె ప్రగతి’

ABN , First Publish Date - 2023-06-15T23:48:18+05:30 IST

పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ సంగీతసత్యనారాయణ అన్నారు.

గ్రామాల స్వరూపాన్ని మార్చిన ‘పల్లె ప్రగతి’

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 15 : పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ సంగీతసత్యనారాయణ అన్నారు. తెలంగా ణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మం డలంలోని ముత్తారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం తెలంగాణ పల్లెప్రగతి దినోత్సవంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో కలెక్టర్‌ డాక్ట ర్‌ ఎస్‌ సంగీతసత్యనారాయణ పాల్గొన్నారు. పల్లెప్రగతి దినోత్సవంలో భాగంగా ముత్తారం గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, పల్లెప్రకృతి వనాన్ని సంద ర్శించారు. గ్రామపంచాయతీ భవనం ఆవరణలో సర్పంచ్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో సభ నిర్వహించి గత తొమ్మిది సంవత్సరాల కాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారా యణ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలలో భాగంగా జిల్లాలోని 266 గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి వేడుక లు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో వివి ధ వర్గాలవారికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరుస్తూ, జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌ ఆరోగ్యలక్ష్మి, కోతలు లేని నిరంత రాయ విద్యుత్‌ సరఫరా, రెసిడెన్షియల్‌ పాఠశాలలు వంటి అనేక పథకాలను అమలుచేస్తోందన్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా లబ్ధి జరిగే పథకాలతో పాటు గ్రామాల అభి వృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పించి, నూతన పంచాయతీరాజ్‌ చట్టా న్ని రూపొందించిందని, పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వ రూపం మారిపోయాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి గ్రామంలో ట్రాక్ట ర్‌, ట్యాంకర్‌, ట్రాలీ ఏర్పాటు చేయడం వల్ల పారిశుధ్యం మెరుగుప డిందని, ప్రతిరోజు చెత్త సేకరణ జరుగుతుందని, దీనివల్ల దోమలు, ఈగలు తగ్గిపోయి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు. చిన్న చిన్న మార్పుల వల్ల అద్భుత ప్రగతి సాధ్యమవుతుందని, గతంతో పోలిస్తే పారిశుధ్యం గ్రామాల్లో గణనీయంగా పెరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్‌, శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో మరే రాష్ట్రంలో గ్రామాలలో ఇలాంటి వసతులు లేవని తెలి పారు. ముత్తారం గ్రామాల్లోకి వచ్చేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలికాయని, గ్రామంలో నర్సరీ ఏర్పాటు చే సుకొని హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటి సంరక్షిస్తు న్నామని, పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకరమైన వా తావరణాన్ని సృష్టించడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు. ప్ర భుత్వం ప్రజల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాలు చేరువ చే సేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శిని నియ మించామని, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చోట నూతనంగా సిమెంట్‌ రోడ్లను మంజూరు చేసి నిర్మించామని కలెక్టర్‌ తెలిపారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నీటి సరఫరా ఇబ్బందులను మి షన్‌భగీరథ ద్వారా దాదాపు పరిష్కరించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం 500 జనాభాకు ఒక మల్టీపర్పస్‌ వర్కర్‌ను నియమించి ప్రతి మాసం 9 వేల 500 వేతనాలు అందిస్తున్నామని, ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాలు ,రోడ్లు, పాఠశాలలను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్ల పాత్రను గుర్తించి సత్కరిస్తున్నా మని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల విస్తృత భాగస్వామ్యం తోడవడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలలో ప్రకటించిన జాతీయ అవార్డులలో మన రాష్ట్రానికి 30 శాతం పైగా అవార్డులు వచ్చాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమ ని, మన గ్రామంలో జరిగిన మార్పులను గమనిస్తూ, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రామ సభలలో చర్చించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ స్రవంతి, గ్రామ సర్పంచ్‌ ఎద్దు కుమారస్వామి, జిల్లా సహకార అధికారి మైఖేల్‌ బోస్‌, ఎంపీ డీవో రాజు, మండల పంచాయతీ అధికారి సుదర్శన్‌, ప్రజాప్రతిని ధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-15T23:48:18+05:30 IST