రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినతుల వెల్లువ
ABN , First Publish Date - 2023-01-03T00:35:14+05:30 IST
సమస్యలు పరిష్క రించాలంటూ ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ అనురా గ్ జయంతిని కలిసి విన్నవించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు ప్రజావాణిలో సమస్యలను విన్నవించేందుకు జిల్లా నలూమూల నుంచి ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ ప్రజలతో కిటికిటలాడి పోయింది.

సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి2: సమస్యలు పరిష్క రించాలంటూ ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ అనురా గ్ జయంతిని కలిసి విన్నవించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు ప్రజావాణిలో సమస్యలను విన్నవించేందుకు జిల్లా నలూమూల నుంచి ప్రజలు తరలిరావడంతో కలెక్టరేట్ ప్రజలతో కిటికిటలాడి పోయింది. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్‌లు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇందులో మొత్తం 32 అర్జీలు రాగా అందులో రెవెన్యూ 10 , డీఅర్‌డీవో 1, సిరిసిల్ల మున్సిపాల్టీ7, వేములవాడ మున్సిపాల్టీ 2, తంగ ళ్లపల్లి ఎంపీడీవో 2, డీపీవో 1, డీసీవో 1, డీసీఎస్‌వో 1, జిల్లాఎస్పీ 2, ఎస్సీ కార్పొరేషన్2, ఎల్‌డీఎం 1, డీఎంఅండ్ హెచ్‌వో 2 వచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రజావాణి సమావేశంలో కలెక్టర్ మాట్లా డుతూ ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన దర ఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న వాటిని సత్వ రమే పరిష్కరించాలని అధికారులను అదేశించారు.
ఇల్లంతకుంట మండలంలోని ముంపు గ్రామామె ౖన అంతగిరి అర్‌అండ్‌అర్ కాలనీలో సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నిర్వాసితులు కలెక్టరేట్‌కు తరలివచ్చి వినతిపత్రం అందించారు. అర్‌అండ్‌అర్ కాలనీని సందర్శించి సమస్యలు పరిశీ లించి న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ పల్లె నర్సింహారెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఎలాంటి ముంపు ప్యాకేజీలను అందించకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ టీసీ గొట్టెపర్తి పర్శరాం, ఉపసర్పంచ్ బాలకిషన్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పాత మార్కెట్ యార్డులో ఉన్న చేనేత జౌళీశాఖ గోదాముల్లో ప్రభుత్వం అర్డర్లను కొనుగోలు చేస్తున్న కన్సల్టేషన్ అధికారి సామల శంకరయ్యకు తాము పెట్టిన అర్‌టీఐ ధరఖాస్తులను తిరస్కరిం చారని దీనిపై విచారణ చేపట్టి అధికారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పవర్‌లూమ్ మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిమ్మని ప్రకాష్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణకు ముగ్గురు పిల్ల లు ఉన్నప్పటికీ సహకార ఎన్నికల నిబంధనలను విస్మరించి చైర్మన్‌గా ఎన్నికైయ్యాడని అతనిపై సహకార చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాగుల రాములు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామపంచాయ తీలో గ్రామసభలు నిర్వహించడం లేదని దీనిపై విచారణ జరిపిం చాలని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో మహిళ గ్రామసమాఖ్య భవనంలో తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో మహిళ సంఘాల సమావేశాలకు ఇబ్బందులు పడుతున్నామని మహిళ సమాఖ్య సభ్యులు జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు. అద్దె కూడా చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.