వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారు

ABN , First Publish Date - 2023-06-16T00:05:13+05:30 IST

వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారని వాస్తవాలు మా ట్లాడితే తప్పా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్‌పూర్‌ మండ లంలోని రోళ్లవాగు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రాజుల దేవుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

తప్పులను ఎత్తి చూపితే తప్పా

ఎమ్మెల్సీ టీ.జీవన్‌ రెడ్డి

బీర్‌పూర్‌,జూన్‌ 15: వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారని వాస్తవాలు మా ట్లాడితే తప్పా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్‌పూర్‌ మండ లంలోని రోళ్లవాగు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన రాజుల దేవుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారని మంత్రి ఇంత అసహనానికి లోను కావద్దని సూచించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలైనా, సలహాలు, సూచనలైనా స్వీకరించాలని అన్నారు. తాను మంత్రిగా ఉన్నపుడు సలహాలు, సూచనలు చేశారు, విమర్శలు కూడా చేశారని గుర్తు చే శారు. రైతులను మిల్లరు దోపిడీ చేస్తున్నా ఒక్కరిపైనైనా చర్యలు తీసు కున్నారా అని అన్నారు. ఇథనాల్‌ ప్రాజెక్టు కావాలా.. చక్కెర కర్మగారం కావాలా అనే దా నిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని అన్నారు. జగిత్యాల, అంతర్గాం, రాయి కల్‌, మైతాపూర్‌, పోరుమల్ల, మల్లాపూర్‌, ఇబ్రహింపట్నం గ్రామాలలో చెరుకు సాగు చేస్తున్నారని ఈ గ్రామాలవారు రవాణా భారాన్ని మోస్తున్నారని అన్నా రు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమను జనవాసాల్లో ఏర్పాటు చేస్తారా అని ప్ర శ్నించారు. గతేడాది సాంకేతిక లోపాలు, ప్రకృతి వైపరీత్యాలతో రోళ్లవాగు తెగి పోవడంతో పంట భూములు ఇసుక మేటలు వేసి రైతులు పంటలు నష్టపో యారన్నారు. కమ్మునూర్‌, కళమడుగు వంతెన ఎవరి హయాంలో నిర్మించారని, అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ మర్తి రమేష్‌, జడ్పీటీసీ పాత పద్మ రమేష్‌, వైస్‌ ఎంపీపీ బల్మురి లక్ష్మన్‌ రావ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ కోండ్రా రాం చంద్రారెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సుభాష్‌ యాదవ్‌, ప్రధానకా ర్యదర్శి నారపాక కమలాకర్‌, ఉపాద్యక్షులు జోగి రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచారక మిటీ కన్వీనర్‌ జితేంధర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-16T00:05:13+05:30 IST