ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha : విచారణకు రాలేనని చెప్పిన కవిత.. కుదరదన్న ఈడీ.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

ABN, First Publish Date - 2023-03-16T11:59:57+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నేటి ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ (ED) ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నేటి ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి రోజున అంటే ఈ నెల 11న కవిత విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇంతటి ఉత్కంఠ నెలకొన్నది లేదు. ఇవాళ మాత్రం ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. తొలుత ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు రానుందంటూ న్యూస్ బయటకు వచ్చింది. ఆ తరువాత అది కాస్తా.. 10:30 కు మారింది. కానీ అది కూడా లేదు. ఇంతవరకూ ఆమె కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చిందే లేదు. 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా బయటకు రాలేదు.

అసలు కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నివాసంలో కవిత.. మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్‌రావు (Harish Rao) తదితరులతో పాటు న్యాయ నిపుణులతో భేటీ అయినట్టు సమాచారం. అనంతరం 11:30 సమయంలో ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో పంపించారు. తన అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చింది. ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో కవిత తదుపరి స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

Updated Date - 2023-03-16T12:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising