KCR: కేసీఆర్‌ని కలవడానికి ఫాం హౌస్‌కి వెళ్లిన ఎర్రవెల్లి గ్రామస్థులు.. పర్మిషన్ ఇవ్వని పోలీసులు
ABN , First Publish Date - 2023-12-06T14:56:43+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) ఘోర పరాభవం ఎదుర్కున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) అప్పటి నుంచి తన ఫాం హౌజ్(KCR Farm House) లోనే ఉంటున్నారు.
ఎర్రవెల్లి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) బీఆర్ఎస్ ఓటమిపాలవ్వడంతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తన ఫాం హౌజ్‌లోనే (KCR Farm House) ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే ఆయన ప్రగతిభవన్ నుంచి ఫామ్ హౌస్‌కు తరలివెళ్లారు. ఆయన ఇప్పటివరకు బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
అడపాదడపా బీఆర్ఎస్ శ్రేణులతో మీటింగ్‌లు పెడుతున్నా ఎక్కువగా బయటకి కనిపించడంలేదు. ఇవాళ కేసీఆర్‌ని కలవడానికి ఆయన స్వగ్రామం అయిన చింతమడక గ్రామస్థులు వెళ్లారు. 540 మంది 9 బస్సుల్లో ఫాం హౌజ్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకోగా పోలీసులు వారిని ఆపివేశారు. అనుమతి ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో గ్రామస్థులు సందిగ్ధంలో పడ్డారు.