MP Arvind: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌లేంటి?
ABN, First Publish Date - 2023-04-27T18:12:39+05:30
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు.
హైదరాబాద్: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ (BJP) ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. పంటనష్టంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని, రైతులు కష్టాలు పడుతుంటే.. సీఎం మహారాష్ట్ర టూర్‌లేంటి? అని అర్వింద్ ప్రశ్నించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే.. BRS ఆత్మీయ సమ్మేళనాలా? అని మండిపడ్డారు. పంట నష్టంపై గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, రైతుకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని అర్వింద్ డిమాండ్ చేశారు.
మంత్రులు కేటీఆర్ (KTR), ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy)పై ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. అక్రమ సంపాదనను దాచుకోవడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కమీషన్ల డిమాండ్‌కు భయపడి పసుపు బోర్డు ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. కేసీఆర్ (KCR) కాళ్లు మొక్కి సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులు తెచ్చానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పడం దారుణమన్నారు
Updated Date - 2023-04-27T18:12:47+05:30 IST