ABN effect: అధికారుల అవినీతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయిందన్న వీహెచ్
ABN, First Publish Date - 2023-07-31T17:04:04+05:30
కిన్నెరసాని వరద ఉధృతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఇరిగేషన్ శాఖ, అవినీతి కాంట్రాక్టర్ ధనదాహంకు నాగారం చెక్ డ్యాం నిదర్శనంగా నిలిచింది. చెక్ డ్యాం కొట్టుకుపోయిన విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం: కిన్నెరసాని వరద ఉధృతికి నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఇరిగేషన్ శాఖ, అవినీతి కాంట్రాక్టర్ ధనదాహంకు నాగారం చెక్ డ్యాం నిదర్శనంగా నిలిచింది. చెక్ డ్యాం కొట్టుకుపోయిన విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. చెక్ డ్యాం సైట్ దగ్గరకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ నేతలు పరిశీలనకు వచ్చారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, బీజేపి జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని, సీపీఎం నేత పోతినేని సుదర్శన్ చెక్ డ్యాం సైట్‌ను పరిశీలించారు.
వీహెచ్ కామెంట్స్..
‘‘సీఎం కేసీఅర్ పాలనలో అవినీతికి నిదర్శనం నాగారం చెక్ డ్యాం. రూ.11 కోట్లతో ఏడాది క్రితం నిర్మించిన చెక్ డ్యాం కిన్నెరసాని వరద ఉధృతికి కొట్టుకుపోవడం కేసీఅర్ పాలనలో కాంట్రాక్టర్ల దోపిడీ ఎలా ఉందో చూడొచ్చు. కాంట్రాక్టర్, బాధ్యులైన అధికారులపై కేసులు పెట్టాలి.’’ అని కాంగ్రెస్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు.
కోనేరు చిన్ని కామెంట్స్
‘‘కేసీఅర్ పాలనలో కాంట్రాక్టర్ల అవినీతికి నిదర్శనంగా నాగారం చెక్ డ్యాం నిలిచింది. రూ.11 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం కిన్నెరసాని ఒక్క వరదకు కొట్టుకుపోయింది. ఎమ్మెల్యే కమీషన్ల కోసమే అవినీతి నిర్మాణం. బాధ్యులైన ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి.’’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని డిమాండ్ చేశారు.
కూనంనేని సాంబశివరావు
‘‘అధికారుల అవినీతికి నిదర్శనం నాగారం చెక్ డ్యాం. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. రూ.12 కోట్ల నిధులు వరద పాలైయ్యాయి. కోతకు గురైన ముంపు రైతులకు ఎకరాకు ఇరవై లక్షలు పరిహారం ఇవ్వాలి.’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
Updated Date - 2023-07-31T17:04:04+05:30 IST