Rega Kantharao: అలా మాట్లాడితే నాలుక చీరుస్తాం...కాంగ్రెస్‌కు రేగా వార్నింగ్
ABN, First Publish Date - 2023-02-20T13:53:09+05:30
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుండేది లేదని నాలుక చీరుస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుండేది లేదని నాలుక చీరుస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (BRS Leader, Government Whip Rega KanthaRao)హెచ్చరించారు. సోమవారం భద్రాచలం (Bhadrachalam) లో పర్యటించిన రేగా ఆపై మీడియాతో మాట్లాడుతూ... కొందరు నాయకులు, కార్యకర్తలకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకోవాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల హడావుడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో పోటీలు తట్టుకోలేక కొంతమంది నాయకులు బయటకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. గౌరవ కేసీఆర్ (Telangana CM KCR) నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్క నాయకులకు పార్టీలో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూ వారి స్వార్థం కోసం పనిచేసే నాయకులు పార్టీని బదనాం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేపు జరిగే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తే పార్టీలో కేసీఆర్ (Telangana CM) పిలిచి అవకాశాలు ఇస్తారని అనుకోవడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడమే అని రేగా కాంతారావు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-02-20T13:53:11+05:30 IST