BRS: ఇల్లందు బీఆర్ఎస్‌లో కాక రేపుతున్న అసమ్మతి మంటలు
ABN, First Publish Date - 2023-10-13T18:49:41+05:30
జిల్లాలో ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌లో అసమ్మతి మంటలు కాక రేపుతున్నాయి. అసమ్మతి వాదులను శాంతపరిచేందుకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ రంగంలోకి దిగారు. ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేత మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో బుజ్జగింపుల ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు కూడా నేతల తీరు ఇలాగే పార్టీ నష్టపో్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ వారిని శాంతపరుస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కలసి కట్టుగా పనిచేయాలని అసమ్మతి నేతలను మంత్రి బుజ్జగిస్తున్నారు.
Updated Date - 2023-10-13T18:49:41+05:30 IST