ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR:కాంగ్రెస్ పాలనలో నష్టాల్లో సింగరేణి.. బీఆర్ఎస్ వచ్చాకే లాభాల్లోకి: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2023-11-05T16:36:20+05:30

కాంగ్రెస్(Congress) పాలనలో సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని.. గత పదేళ్లలో బీఆర్ఎస్(BRS) సర్కార్ తీసుకున్న చర్యల వల్ల లాభాలబాట పట్టిందని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు.

కొత్తగూడెం: కాంగ్రెస్(Congress) పాలనలో సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని.. గత పదేళ్లలో బీఆర్ఎస్(BRS) సర్కార్ తీసుకున్న చర్యల వల్ల లాభాలబాట పట్టిందని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం(Kothagudem) జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని.. సరైన అభ్యర్థిని ఎంచుకోవడం పౌరుల బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీల అభ్యర్థులను చూసి ఓటేయాలని విన్నవించారు. సింగరేణి(Singareni) తెలంగాణ ప్రజల ఆస్తి అని.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని కేంద్రం చేతిలో పెట్టాయని విమర్శించారు. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించి.. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి కారకులయ్యారని ఆరోపించారు. సంస్థ మరిన్ని లాభాలు పొందేందుకు బీఆర్ఎస్ వద్ద స్పష్టమైన ప్లాన్ ఉందని వెల్లడించారు. 9 ఏళ్లుగా కార్మికులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నామని.. 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ కార్మికుల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ని నమ్మి ఓటేస్తే మళ్లీ 60 ఏళ్లు వెనక్కి వెళ్తామని హెచ్చరించారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసి చూపించని ఎన్నో పనులు బీఆర్ఎస్ వచ్చాక చేశామన్నారు. 70 శాతం పూర్తయిన సీతారామ ప్రాజెక్టును కంప్లీట్ చేసి తానే వచ్చి ప్రారంభిస్తానని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-05T16:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising