Congress: కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2023-07-02T10:48:22+05:30
ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ తోరణాలు, కటౌట్లతో ఖమ్మం నగరం నిండిపోయింది.
ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభ (Congress Jana Garjana Bahiranga Sabha)కు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ తోరణాలు, కటౌట్లతో ఖమ్మం నగరం నిండిపోయింది. ఉమ్మడి ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి భారీగా జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సభకు 5 లక్షల మందికిపైగా తరలించేలా వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. 55 అడుగుల ఎత్తులో 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చొనేలా సభా వేదిక ఏర్పాటు చేశారు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్ కూడా పెట్టారు.
100 ఎకరాల్లో సభ ఏర్పాటు...
100 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు. వేదిక ముందు 1.50 లక్షల మంది కూర్చొని వీక్షించేలా గ్యాలరీలు, కుర్చీలు సిద్ధం చేశారు.. సభను వీక్షించేలా 12 భారీ స్క్రీన్లు.. మరో 4 లక్షల మంది నిల్చొని చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం సభ తర్వాత రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు.
Updated Date - 2023-07-02T10:48:22+05:30 IST