Rega KantaRao: తమాషా రాజకీయాలు నడుస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి
ABN, First Publish Date - 2023-02-01T14:36:52+05:30
జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని... కార్యకర్తలు, గులాబీ సైనికులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని... కార్యకర్తలు, గులాబీ సైనికులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (Government Whip Rega Kantha Rao) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రెండు సార్లు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బాగా నష్టపోయిందన్నారు. ఈసారి ఈ గందరగోళంలో పడి మనం కూడా గాయి గాయి కాకుండా తమాషా రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికలలో జిల్లాలో ఐదుకు 5 సీట్లు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే (Bhadrachalam MLA) ఏడాదికి ఒకసారి బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో మాత్రమే ప్రజలకు కనబడతాడు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. దళితబంధు (Dalita Bandhu) ఎమ్మెల్యే అనుచరులకు బంగారు బాతు గుడ్డులాగా దొరికిందని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు అయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందన్నారు. స్థానిక నాయకులకే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్‌లు వస్తాయన్నారు. టూరిస్ట్‌లాగా వచ్చే వారికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ (Telangana CM KCR)నాయకత్వం కోసం దేశమంతా ఎదురు చూస్తోందని రేగా కాంతారావు వెల్లడించారు.
Updated Date - 2023-02-01T14:36:53+05:30 IST