Puvvada Ajay: స్వాతంత్య్ర పోరాటంలో ఖమ్మంకు విశిష్ట స్థానం
ABN, First Publish Date - 2023-08-15T12:54:53+05:30
స్వాతంత్ర్య పోరాటంలో మన జిల్లాకు విశిష్ట స్థానం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.
ఖమ్మం: స్వాతంత్ర్య పోరాటంలో మన జిల్లాకు విశిష్ట స్థానం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay kumar) అన్నారు. జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణకు గాను రెండు కోట్ల 15 లక్షల రూపాయిలతో సి.టి స్కాన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. జిల్లాలో 161 పల్లె దవాఖానాలు, 09 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని తెలిపారు. బనిగండ్లపాడు ఆరోగ్య కేంద్రానికి రూ.కోటి 56 లక్షలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 115 పాఠశాలలకు ప్రతి పాఠశాలకు రూ.9 లక్షల ఖర్చుతో 8, 9, 10 తరగతులకు డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.
అర్హులైన వారందరికీ ప్రతినెలా 15 వందల మందికి బీసీబంధు అందజేస్తున్నమన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సోలార్ కలెక్టరేట్ భవనం ప్రారంభించామని.. ఖమ్మం - సూర్యాపేట రహదారి 15 వందల 66 కోట్లతో 58.62 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. చింతకాని మండలంలో 3462 మంది లబ్దిదారులకు దళిత బంధు మంజూరు చేశామని.. 2015 నుంచి ఇప్పటి వరకు 8956 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. వంద కోట్లతో గోళ్ళపాడు ఛానల్‌ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. రూ.4 కోట్ల 50 లక్షలతో ఇల్లందు క్రాస్ రోడ్డులో ఆధునిక మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. జీవో 58,59 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఇండ్లను క్రమబద్ధీకరుస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.
Updated Date - 2023-08-15T12:54:53+05:30 IST