Ponguleti Srinivas Reddy: గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటాం
ABN, First Publish Date - 2023-09-23T16:42:49+05:30
తెలంగాణ హైకోర్టు(Telangana High Court)గ్రూప్1 పరీక్షలను రద్దు చేసిందని.. పరిక్ష రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)గ్రూప్1 పరీక్షలను రద్దు చేసిందని.. పరిక్ష రాసిన అభ్యర్థులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్(CM KCR) 2022లో లక్షా 91 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి కాలయాపన చేశారు. మొదటిసారి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినప్పుడు 3 లక్షల 80 వేల మంది పరీక్షలు రాశారు. రాష్ట్రంలో కొంతమంది మంత్రులు, ఉద్యోగులు రాజకీయ స్వార్థం కోసం పేపర్ లీక్ చేశారు. వారికి కావాల్సినోళ్లకి పేపర్ ఇచ్చారు. కష్టపడిన అభ్యర్థులను రోడ్డు పాలు చేశారు. వారికి కాంగ్రెస్ అండగా నిలిచింది. రెండోసారి పరీక్షలు నిర్వహించిన విధానంపై నిరుద్యోగులకు అనుమానాలు ఉన్నాయి. మరోసారి నిరుద్యోగులు కోర్టుకు వెళ్లారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. నిరుద్యోగ యువతకి విజ్ఞప్తి.. 60 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతమంది అధికారులతో నిరుద్యోగులు కొందరు కుమ్మక్కై పేపర్ లీక్ చేశారు. పరీక్షలు రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి లక్షన్నర రూపాయలు ఆర్థిక సాయం బీఆర్ఎస్ ప్రభుత్వం అందించాలి’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2023-09-23T16:42:49+05:30 IST