ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Renuka Chowdhury: కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది

ABN, First Publish Date - 2023-10-06T20:44:48+05:30

కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ రేణుకచౌదరి(Renuka Chowdhury) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు.

ఢిల్లీ: కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ రేణుకచౌదరి(Renuka Chowdhury) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. రేణుక చౌదరి నేతృత్వంలో మల్లికార్జున్ ఖర్గేను కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో రేణుకచౌదరి మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపుల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఖర్గేను కోరాం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖర్గే, కేసీ వేణు గోపాల్‌తో ఈరోజు భేటీ అయ్యాము. అన్ని సామాజిక వర్గాలను గుర్తు పెట్టుకోవాలని కోరాం. కమ్మ సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పించాలని కోరాం. విదేశాల నుంచి చాలా మంది ఫోన్ చేసి సామాజికవర్గం సభ్యులకు మద్దతుగా నియోజకవర్గాల్లో తిరుగుతామని చెప్పారు.

కమ్మ సామాజికవర్గం గురించి ఖర్గేకి అన్ని విషయాలు తెలుసు. కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణలో 10సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ఓటు బలం ఉంది. ఐటీ, మీడియా, ఇండస్ట్రీ అన్ని వర్గాలల్లో కమ్మ సామాజిక వర్గం ఉందని రేణుక చౌదరి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-06T20:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising