Tummala: మంత్రి పువ్వాడ అఫిడవిట్ తిరస్కరించాలని ఈసీకి తుమ్మల ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-11-13T15:03:19+05:30
పువ్వాడ అఫిడవిట్ ప్రిస్కైబ్ ఫార్మెట్‌లో లేదు. ఫార్మెట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం.
ఖమ్మం: బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజేయ్ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara rao) డిమాండ్ చేశారు. పువ్వాడ అజేయ్ అఫిడవిట్ సరైన ఫార్మెట్‌లో లేదని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. ‘‘పువ్వాడ అఫిడవిట్ ప్రిస్కైబ్ ఫార్మెట్‌లో లేదు. ఫార్మెట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాం. రిటర్నింగ్ అధికారి తీరుపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్‌లో కాకుండా మార్చి ఇచ్చారు. అఫిడవిట్‌లో డిపెండెంట్ కాలమ్ మార్చారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవ్వరు లేకపోతే నిల్ రాయకుండా మార్చారు. నాలుగు సెట్స్ నామినేషన్లలో తప్పులు ఉన్నాయి. ప్రిస్కైబ్ ఫార్మెట్ (prescribe format)లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగా. ఆర్వోపై న్యాయ పోరాటం చేస్తా. ఆర్వో ఎన్నికల నిబంధనలు పాటించలేదు.’’ అని తుమ్మల ధ్వజమెత్తారు.
Updated Date - 2023-11-13T15:03:21+05:30 IST