ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే ఉద్దరిస్తున్నాడు

ABN, First Publish Date - 2023-09-29T19:25:49+05:30

తెలంగాణకు కేంద్రం సాయంపై అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్‌తో చర్చకు సిద్ధమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) సవాల్ విసిరారు.

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం సాయంపై అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్‌తో చర్చకు సిద్ధమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) సవాల్ విసిరారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తనకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానితో కలసి సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదో చెప్పాలి.తెలంగాణ ప్రజల మేలు అవసరం లేదు కాబట్టే.. ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మమత బెనర్జీ, స్టాలిన్ లాంటి నేతలు ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అక్టోబర్ 1వ తేదీన పాలమూరులో బహిరంగ సభ, అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. అభివృద్ధి చేస్తామంటే కేసీఆర్ సర్కార్ కేంద్రానికి సహకరించటం లేదు.కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే ఉద్దరిస్తున్నాడు. తెలంగాణలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ సహకరించటం లేదు. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా మోదీ 13,545వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి సహకారం లేకపోవటంతో అనేక ప్రాజక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మోదీ ప్రారంభించబోయే రైల్వేలైన్ తో హైదరాబాద్, గోవా మధ్య 102కిమీ దూరం తగ్గుతుంది. జాతీయ రహదారులు నిర్మాణాల్లో ప్రధాని మోదీ తెలంగాణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కాచిగూడ నుంచి రాయచూర్ రైల్వే లైన్‌ను మోదీ ప్రారంభిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతన భవనాలను వర్చువల్ గా మోదీ ప్రారంభిస్తారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు పెరిగాయి.ఇచ్చిన‌ హామీలు ఎందుకు అమలు చేయలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి.

మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారికి మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే అర్హత లేదు.మోటార్లకు మీటర్లు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని మోదీ ప్రసగింస్తారు. అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ ఉంటుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,021కోట్ల ప్రాజక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మోదీ అంకితం చేస్తారు.800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకుంటుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.1369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోదీ భూమిపూజ చేస్తారు. ఎయిమ్స్ నూతన భవనానికి శుంకుస్థాపన చేస్తారు.

Updated Date - 2023-09-29T19:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising