ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‎లను ప్రజలు తరిమికొడతారు

ABN, First Publish Date - 2023-11-26T12:37:09+05:30

ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టనున్నారని

- కృష్ణాయాదవ్‌ ప్రచారంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టనున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి(G. Kishan Reddy) హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాచిగూడ లింగంపల్లిలోని వినాయక ఆలయం నుంచి రోడ్‌షో నిర్వహించారు. సి.కృష్ణాయాదవ్‌, ఎన్‌.గౌతమ్‌రావు, కార్పొరేటర్లు క న్నె ఉమాదేవి, వై.అమృత రోడ్‌షో నిర్వహించారు. యువమోర్చా కార్యకర్తలు జీపు వెంట బైక్‌లపై ర్యాలీగా వెళ్లారు. కన్నె రమేష్‏యాదవ్‌, ఎక్కాల నందు, నందకిషోర్‌యాదవ్‌, సి.వినోద్‌యాదవ్‌, దడిగె జగన్‌యాదవ్‌, ఏ.సూర్యప్రకా్‌షసింగ్‌, ఎడెల్లి అజయ్‌కుమార్‌, కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

- రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి, కృష్ణాయాదవ్‌ అన్నారు. గోల్నాక రోడ్‌లోని సల్వా గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో కుట్టుమిషన్‌ కార్మికుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల మెగ్గుచూపుతున్నారని తెలిపారు. సమ్మేళనంలో క్షీర్‌సాగర్‌, కృష్ణ, శ్రీను, వెంకటేష్‌, అరవింద్‌, గోవింద్‌, శ్రీనివాస్‌, నరేందర్‌, సుబ్రహ్మణ్యం, అర్చన, లావణ్య, ఈశ్వరి, నిర్మల, గీ, రేఖ, బీజేపీ డివిజన్‌ కన్వీనర్‌ మూల రవీందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T12:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising