కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: ఆ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్‌ఎస్‏కే పట్టం కట్టాలి

ABN, First Publish Date - 2023-11-24T11:11:35+05:30

గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడోసారి బీఆర్‌ఎ్‌సకే పట్టం

KTR: ఆ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్‌ఎస్‏కే పట్టం కట్టాలి

హైదరాబాద్: (ఆంధ్రజ్యోతి): గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడోసారి బీఆర్‌ఎ్‌సకే పట్టం కట్టాలని మంత్రి కేటీఆర్‌(Minister KTR) అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఆయన చేపట్టిన రోడ్‌షో గురువారం సాయంత్రం ఈసీఐఎల్‌ చౌరస్తాలో అట్టహాసంగా సాగింది. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించామని ఆయన వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పలు పథకాలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, మూసీనదిని ప్రక్షాళన చేసి సుందరీకరిస్తామని పేర్కొన్నారు. వర్షాకాలంలో వరద ముంపు నివారణకు రూ.20వేల కోట్లతో భూగర్బ డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదల కోసం నగరంలో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ కేసీఆర్‌ బీమా పథకం కింద రూ.5లక్షలు చెల్లిస్తామన్నారు. అంతేగాక రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఉప్పల్‌ నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, నాయకులు కొత్త రామారావు, పజ్జూరి పావనీరెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

cc.jpg

Updated Date - 2023-11-24T11:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising