ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలే.. ముసలి నక్కలాంటి కాంగ్రెస్‏తో ఏమీ కాదు..

ABN, First Publish Date - 2023-10-01T12:47:21+05:30

150ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ముసలినక్క లాంటిదని, ఆ పార్టీ పీనుగతో సమానమని, దశాబ్ధాల కాంగ్రెస్‌కు వారంటీ తీరిందని, అలాంటి పార్టీ ప్రజలకు ఇచ్చే

సత్తుపల్లి(ఖమ్మం): 150ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ముసలినక్క లాంటిదని, ఆ పార్టీ పీనుగతో సమానమని, దశాబ్ధాల కాంగ్రెస్‌కు వారంటీ తీరిందని, అలాంటి పార్టీ ప్రజలకు ఇచ్చే ఆరు గ్యారంటీ పథకాల హామీ ఆరిపోయే దీపమేనని ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌(KTR) విమర్శించారు. సత్తుపల్లిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌ కాంగ్రెస్‏పై ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ ఆకాశంలో చంద్రుడిని సత్తుపల్లిలో కట్టిపడేస్తామని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు అప్పుడు ఏమీ చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆరు గ్యారంటీ పథకాలు అంటూ కొత్తపాట అందుకున్నారని అన్నారు. కాంగ్రె్‌సకు ఓటు వేస్తే ఏడాదికో ముఖ్యమంత్రి మారుతారని, మూడు గంటల వ్యవసాయ విద్యుత్‌ ఇస్తారని, ఆకాశం నుంచి భూగర్భంలో బొగ్గు వరకు కుంభకోణాలు చేస్తారని విమర్శించారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ నాయకులకు డబ్బు వస్తుందని, ఎన్నికల్లో పంచే ఆ డబ్బును తీసుకుని అభివృద్ధికి మారుపేరైన బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నీటితో సస్యశ్యామలం చేసే సీతారామా ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌ డిజైన్‌ చేశారని, ఇప్పటికే 90శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తిచేసి జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరును అందించబోతున్నామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వేలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) నూరుశాతం దళితబంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని కేటీఆర్‌ ప్రకటించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రూ.1000కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆయనను తిరిగి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

నిన్నటివరకు కేసీఆర్‌ను పొగిడి నేడు తిడుతున్నారు

కొందరు నిన్నమొన్నటివరకు పార్టీలో పదవులు అనుభవించి టికెట్‌ రాకపోవడంతో పార్టీమారి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నిన్నటివరకు దేవుడుగా ఉన్న కేసీఆర్‌ నేడు దెయ్యం ఎలా అయ్యారో వారికే తెలియాలన్నారు. సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడేవారు గత ప్రభుత్వాల్లో కూడా అధికారంలో ఉన్నారని, అప్పు డు ఈ ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యం ప్రదర్శించి రానున్న ఎన్నికలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభలో రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్ధసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ కూసంపూడి మహేష్‌, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ ఛైర్మన్‌ వనమా వాసు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులు ఎస్‌కే.రఫీ, యాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-01T12:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising