ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kaleshwaram : తప్పుల కుప్ప

ABN, First Publish Date - 2023-11-04T03:37:15+05:30

‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్‌ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.

మేడిగడ్డ ప్రస్తుతం యూజ్‌లెస్‌.. అన్నారం, సుందిళ్ల పరిస్థితీ డౌటే!

కాళేశ్వరంపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక

ప్లానింగ్‌, డిజైన్‌, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్‌,

నిర్వహణ అన్నీ లోపభూయిష్ఠమే

7వ బ్లాకులాగానే మిగిలినవీ కుంగిపోవచ్చు

అప్పుడు బ్యారేజీనే పునర్నిర్మించాల్సి రావచ్చు

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలూ కుంగే చాన్స్‌

యుద్ధ ప్రాతిపదికన వాటిలో తనిఖీలు చేయాలి

పూర్తిగా పునరుద్ధరించే వరకూ నీటి నిల్వ వద్దు

కుంగుబాటుతో ప్రాణ, ఆస్తి నష్టాలకు అవకాశం

నిబంధనల ఉల్లంఘన తీవ్రమైన విషయం

మేం 20 అంశాల్లో వివరణ కోరితే

11 అంశాలకే జవాబు ఇచ్చారు: ఎన్డీఎస్‌ఏ

పునరుద్ధరించే వరకూ బ్యారేజీ వేస్ట్‌

మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్‌లో పియర్లు కుంగిపోవడంతో మొత్తం బ్యారేజీ సక్రమంగా పని చేయని పరిస్థితి నెలకొంది. బ్యారేజీని పూర్తిగా పునరుద్ధరించే వరకూ అది ఎందుకూ పనికిరాదు.

నీటిని నిల్వ చేస్తే సమస్య మరింత తీవ్రం

ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో నీళ్లు నింపితే బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉంది. అందువల్ల నీటిని నిల్వ చేయొద్దు. ఒకవేళ నీటిని నిల్వ చేస్తే పైపింగ్‌ సమస్య మరింత తీవ్రతరమవుతుంది.

మా సూచనలు పట్టించుకోలేదు

వర్షాకాలానికి ముందు, తర్వాత ఏవైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు సూచించింది. కానీ, అధికారులు దానిని అమలు చేయలేదు. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021లోని నిబంధనలకు విరుద్ధం.

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, భూపాలపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్‌ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి. బ్యారేజీలోని అన్ని బ్లాకులనూ ఒకే విధంగా నిర్మించిన నేపథ్యంలో.. ఇతర బ్లాక్‌లు కూడా ఇదేవిధంగా విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించాల్సి రావచ్చు’’ అని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) తేల్చి చెప్పింది. ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ల్లో లోపాల కారణంగానే డ్యాం కుంగిందని నిర్ధారించింది. ఇక, మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ అచ్చు ఇవే డిజైన్లతో నిర్మించారని, కనక, మేడిగడ్డ తరహాలోనే అవి కూడా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అన్నారం దిగువన ఇప్పటికే బుంగలు ఏర్పడ్డాయని, బ్యారేజీలు కుంగడానికి ఇవి ముందస్తు సంకేతాలని హెచ్చరించింది. పైపింగ్‌ (పునాదుల్లోని ఇసుక)లో సమస్య ఉందా!? ఆ రెండు బ్యారేజీలు కూడా కుంగే అవకాశం ఉందా!? అనే అంశాలపై యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు, పరిశీలన జరపాలని నిర్దేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో నీళ్లు నింపితే బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉందని, అందువల్ల నీటిని నిల్వ చేయొద్దని హెచ్చరించింది.

ఒకవేళ నీటిని నిల్వ చేస్తే పైపింగ్‌ సమస్య మరింత తీవ్రతరమవుతుందని స్పష్టం చేసింది. వెరసి, మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ డిజైన్‌, నిర్మాణం జరిగిన తీరును పరిశీలిస్తే.. దానితోపాటు అదే విధంగా నిర్మించిన అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలు కూడా సురక్షితం కాదని అభిప్రాయపడింది. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు అక్టోబరు 21న కుంగిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం 23 నుంచి 25 వరకూ రాష్ట్రంలో పర్యటించింది. సీడబ్ల్యూసీ సభ్యుడు, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌, ఇతర సాంకేతిక నిపుణుల బృందం డ్యాంను పరిశీలించింది. వివిధ శాఖల రాష్ట్ర అధికారులతో హైదరాబాద్‌లో సమావేశమైంది. అధికారుల నుంచి డ్యాంకు సంబంధించిన సమాచారం తీసుకుంది. సమగ్ర పరిశీలన తర్వాత తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌కు సంచలన నివేదికను అందించింది. తాము అడిగిన కీలకమైన సమాచారాన్ని రాష్ట్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని, తమ వద్ద ఉన్న సమాచారం ఇవ్వకపోతే డ్యామ్‌ సేఫ్టీ చట్టం 2021 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్యారేజీతో ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నందున డ్యామ్‌ సేఫ్టీ చట్టంలోని నిబంధనలను పాటించకపోవడం అత్యంత తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో వాస్తవాలు తెలుసుకోవడానికి, దర్యాప్తునకు రాష్ట్ర అధికారుల నుంచి 20 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరాం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చింది. ఆ ఇచ్చిన డేటా కూడా అసంపూర్తిగా ఉంది. గడువులోగా డేటాను సమర్పించకపోవడంతో బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్రం చేయించలేదని భావించాల్సి వస్తోంది. ఇన్‌స్ర్టుమెంటేషన్‌, వర్షాకాలం ముందు, తర్వాత ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టులు, కంప్లీషన్‌ రిపోర్టులు, క్వాలిటీ కంట్రోల్‌ రిపోర్టులు, థర్డ్‌ పార్టీ మానిటరింగ్‌ రిపోర్టులు, భౌగోళిక సమాచారం తదితర డేటాను ఇవ్వలేదు. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం ఈ సమాచారం నిరాకరించడానికి వీల్లేదు.మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి ప్రధాన కారణం ఫౌండేషన్‌లో కదలిక. బ్యారేజీ పునాది కింది నుంచి పైపింగ్‌ (ఇసుక ) జారింది. దాంతో, పియర్లు కూడా కదిలాయి. వాటిలో పగుళ్లు వచ్చాయి. చాలా కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చు. అంటే, పునాదిగా ఉన్న ఇసుక జారిపోవడం; ఆ ఇసుకకు బ్యారేజీని మోసేంత సామర్థ్యం లేకపోవడం; బ్యారేజీ లోడుకు ఎగువన ఉన్న సీకెంట్‌ పైల్స్‌ (పునాదుల కోసం గుంతలు తవ్వి.. చుట్టూ బ్రాకెట్లు కట్టి.. ఇనుము వేసి, కాంక్రీట్‌ వేసిన) కుంగిపోవడం తదితరాలు.

ప్రాజెక్టు ప్లానింగ్‌, డిజైన్లోనూ లోపాలు ఉన్నాయి. బ్యారేజీని ఫ్లోటింగ్‌ స్ట్రక్చర్‌గా డిజైన్‌ చేసి, రిజిడ్‌ స్ట్రక్చర్‌గా చేపట్టారు. బ్యారేజీకి ఎగువన, దిగువన కింద ఉన్న రాళ్ల వరకూ సీకెంట్‌ పైల్‌ తరహాలో వరుసగా కాంక్రీటు గోడలను నిర్మించారు. భూమి లోపల నీటి ప్రవాహం బ్లాక్‌ అయి ఒత్తిడి పెరిగింది. డిజైన్‌ చేసిన దానితో పోలిస్తే నిర్మాణ శైలిని మార్చేశారు. బ్యారేజీ కట్టడానికి తయారు చేసిన డిజైన్‌ ఒక విధంగా ఉంటే.. నిర్మాణం మరో విధంగా ఉంది. ప్లానింగ్‌ చేసిన విధంగా డి జైన్‌ లేదు. డిజైన్‌ చేసిన విధంగా నిర్మాణం జరగలేదు.

2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి డ్యామ్‌ నిర్వాహకులు సిమెంట్‌ కాంక్రీట్‌ దిమ్మెలను, లాంచింగ్‌ యాప్రాన్‌లను సరిగా పరిశీలించలేదు. మెయింటినెన్స్‌ చేపట్టలేదు. డ్యామ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడి కుంగిపోయింది. వర్షాకాలానికి ముందు, తర్వాత ఏవైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు సూచించింది. కానీ, అధికారులు దానిని అమలు చేయలేదు. ఇది పెద్ద తప్పిదం. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021లోని నిబంధనలకు విరుద్ధం. నిర్వహణ లోపాలతో బ్యారేజీ బలహీనపడి కుంగింది.

వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను నిరంతరం పరిశీలించి.. అసాధారణ సంకేతాలు లేదా కుంగిన ఆనవాళ్లు ఉంటే నివేదిక అందించాలని తెలంగాణ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిరంతరం కోరుతోంది. కానీ, మా సూచనలను పాటించలేదని తెలుస్తోంది. ఇది పెద్ద తప్పిదం. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ ప్రకారం జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) ఆదేశాలు/సూచనలు పాటించకపోతే చట్టంలోని చాప్టర్‌ 10లోని 41 (బి) ప్రకారం ఏడాదిపాటు జైలు శిక్షతోపాటు జరిమానా విధించాలి. దీనికి డ్యామ్‌ ఓనర్‌ (మేడిగడ్డ-రామగుండం ఈఎన్‌సీ/సీఈ) బాధ్యత వహించాల్సి ఉంటుంది. డ్యామ్‌ సేఫ్టీ చట్టాన్ని పట్టించుకోలేదు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగే అవకాశం ఉంది కనక ఇది తీవ్రమైన అంశం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిజర్వాయర్లో నీళ్లు నిల్వ చేస్తే.. బ్యారేజీ మరింత పాడవుతుంది. అందువల్ల, నీటిని నిల్వ చేయవద్దు.

భూమి లోపల వరుసగా సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్‌ నిబంధనలను పటిష్ఠంగా పాటించకపోవడం, నిర్మాణ లోపాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో గ్యాప్స్‌ వచ్చి ఉండవచ్చు. వాటిలోంచి నీళ్లు వెళ్లిపోయి ఉండవచ్చు. ఫలితంగా, ఇసుక జారిపోయి పియర్లు కుంగి ఉండవచ్చు.

బ్యారేజీ పని చేయడానికి వీలుగా దెబ్బతిన్న బ్లాక్‌ను నిర్మాణపరంగా పునరుద్ధరించవచ్చు. కానీ, అన్ని బ్లాకులను ఇదే విధంగా నిర్మించారు. అందువల్ల, మిగిలిన బ్లాకులూ ఇదే విధంగా కుంగిపోవచ్చు. అప్పుడు మొత్తం బ్యారేజీనే పునరుద్ధరించాల్సి రావచ్చు.

Updated Date - 2023-11-04T08:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising