టీడీపీ నల్లగొండ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎల్‌వీయాదవ్
ABN , First Publish Date - 2023-03-16T23:35:09+05:30 IST
నల్లగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్‌గా ఎల్‌వీ యాదవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.

టీడీపీ నల్లగొండ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎల్‌వీయాదవ్
నల్లగొండ, మార్చి 16: నల్లగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్‌గా ఎల్‌వీ యాదవ్‌ను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఎల్‌వీ యాదవ్ బాఽధ్యత లు స్వీకరించారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నూతన సభ్యత్వ కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ హ యాంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు. తనను కోఆర్డినేటర్‌గా ని యమించినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌కు, సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవ ర్గ మాజీ ఇనచార్జి తుమ్మల మధుసూదనరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశం ప్రకారం నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒ క్కరూ కృషి చేయాలన్నారు. ఎల్ వీయాదవ్ గతంలో తెలుగు యువతతో పాటు టీడీపీలో వివిధ పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆయ న పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కా ర్యకర్తలు ఆయన్ను ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో కూరెళ్ల విజయ్‌కుమార్, గుండు వెంకటేశ్వ ర్లు, బొంత రమేష్, రఫిక్, నాగరా జు, జనార్ధన, నర్సింహారావు, సైదు లు, మనోహర్ పాల్గొన్నారు.