Aruna: బీఆర్ఎస్ నేతలకు మోదీ పేరును ప్రస్తావించే అర్హత లేదు
ABN, First Publish Date - 2023-09-28T21:43:41+05:30
సీఎం కేసీఆర్(CM KCR) వద్ద జీతాగాళ్లుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును ప్రస్తావించే అర్హత లేదనిబీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(Aruna) వ్యాఖ్యానించారు.
మహబూబ్‌నగర్: సీఎం కేసీఆర్(CM KCR) వద్ద జీతాగాళ్లుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును ప్రస్తావించే అర్హత లేదనిబీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(Aruna) వ్యాఖ్యానించారు. గురువారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబర్ 1వ తేదీన ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో 9 లక్షల కోట్ల అభివృద్ధి పనులను తొమ్మిదిన్నరేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో సీఎం కేసీఆర్ ఒక్కమోటార్ ప్రారంభించి ప్రాజెక్టు మొత్తం పూర్తయినట్టు దగా, మోసం చేస్తున్నారు. జిల్లా అవసరాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తాం’’ అని అరుణ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-28T21:43:41+05:30 IST