స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2023-05-04T23:26:58+05:30 IST
ఊర్లను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అధికారులు, ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, మే 4 : ఊర్లను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అధికారులు, ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ - 2022-23 పీర్ వెరిఫికేషన్‌పై ఒక రోజు అవగాహన, శిక్షణపై కలెక్టరేట్ సమావేశపు హాలులో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా పీర్ వెరిఫికేషన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఫీడర్ ఛానల్ (కెనాల్) పనులను అవసరం మేరకు గుర్తించి, వారంలోపు నివేదికలు అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ ట్యాం కులు తదితర వివరాలు ఇవ్వాలన్నారు. గ్రామాలలో ప్రకృతి వనాలు ఎన్ని ఉన్నాయి, హరితహారం కార్యక్ర మం నిర్వహణకు ముందే ప్రణాళికను తయారు చేసుకొని నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొని రిజర్వాయర్ల వెంట పెద్ద మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి వనాలను పర్యవేక్షించి పెద్దమొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేటీదొడ్డి, ఉండవల్లి, గట్టు మండలాల్లో ప్రతీ బుధవారం సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అలంపూర్ చౌరస్తా నుంచి దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్లలో వెదురు కంచెను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. షెడ్లలో కంపోస్ట్ ఎరువులు తయారు అవుతున్నాయా, ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్, మరుగుదొడ్డు ఉన్నాయా అని తెలుసు కున్నారు. అంతకుముందు క్రీడలపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి - 2023కి సంబంధించి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించి విజేతలకు ప్రైజ్ మనీ ఇవ్వ నున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకు మండల కమిటీ ఏర్పాటు చేయాలని, ఎంపీడీవో, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తహసీల్దార్, ఎంఈవో, ఎస్‌ఐ, మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు కమిటీలో ఉంటారని చెప్పారు. మహిళలు, పురుషులు ఈ పోటీల్లో పాల్గొనే లా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డీఆర్‌డీఏ ఉమాదేవి, ఎస్సీ కార్పొ రేషన్ ఈడీ రమేష్‌బాబు, పాల్గొన్నారు.
లక్కీడిప్ ద్వారా విద్యార్థి ఎంపిక
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామాంతపూర్)లో ప్రవేశం కొరకు గురువారం కలెక్టర్ వల్లూరు క్రాంతి లక్కీడిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్వేత ప్రియదర్శిని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో ప్రవేశానికి 12 మంది పిల్లలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కలెక్టర్ చాంబర్‌లో లక్కీడిప్ తీయగా, ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన అకీరానందన్ ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థి షెడ్యూల్డ్ కులాల కార్యాలయంలో సంప్రదించి అడ్మిషన్ తీసుకో వాలని సూచించారు.
అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు
ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగుతుందని, ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పనిచేసి నప్పుడే మంచి గుర్తింపు కలుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో కార్యాలయ సబార్డినేట్‌గా విధులు నిర్వహించే ఎండీ ఫయాజ్ పదవీ విరమణ సందర్భంగా కలెక్టర్ అయనను ఘ నంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మద్దిలేటి తదితరులు ఉన్నారు.