ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారు

ABN, First Publish Date - 2023-09-16T19:20:15+05:30

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Ranga Reddy Lift Scheme) కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఎంతో శ్రమించిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు.

కొల్లాపూర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Ranga Reddy Lift Scheme) కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఎంతో శ్రమించిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు. శనివారం నాడు పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. సాయంత్రం కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ...’’దక్షిణ తెలంగాణ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం. పాలమూరు ప్రజలంటే ఒకప్పడు అడ్డా కూలీలు.ఈరోజు తెలంగాణ ప్రజలే.. ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు.పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాను.కొందరు నేతల వల్లే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమైంది.గత పాలకులు పాలమూరు జిల్లా నీటివాటా గురించి అడగలేదు. తెలంగాణ ఉద్యమంలో..నా తొలి పాదయాత్ర జోగలాంబ గద్వాల నుంచే ప్రారంభించా.పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదు.ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారు.మనం ఎత్తులో ఉన్నాం నీళ్లు రావని..పాలమూరు జిల్లా నేతలే మాట్లాడారు.మన నీళ్లు ఏపీకి తరలిస్తుంటే.. ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారు.కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోదీకి చేతకావటం లేదు.విశ్వగురు అని చెప్పుకునే మోదీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదు.బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలి.పదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదు.కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు... కొల్లాపూర్‌కు పాలిటెక్నిక్‌ కాలేజీ మంజూరు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-16T19:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising