BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN, First Publish Date - 2023-09-28T19:17:40+05:30
రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్‌లెట్‌ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు.
వనపర్తి: రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్‌లెట్‌ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో వనపర్తిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంతో దూరదృష్టితో నీటిపారుదల పనులు కొనసాగిస్తున్నాం.భవిష్యత్‌లో వనపర్తికి తాగునీటి కొరత ఉండదు. రూ.425 కోట్ల మిషన్ భగీరథ పనులు పూర్తి చేశాం. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్‌ను నిర్మిస్తాం.
రూ.20 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార, పండ్లు, పూల మార్కెట్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. రూ.76 కోట్ల బైపాస్ రహదారి నిర్మాణానికి, రూ.48 కోట్ల పెబ్బేరు రహదారి నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేస్తాం. రూ.22 కోట్లతో వనపర్తి రాజప్రసాదం పునరుద్ధరణ, శిథిలవస్థలో ఉన్న పాలిటెక్నిక్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. భవిష్యత్‌లో చిట్యాల, రాజనగరం మీదుగా మరో బైపాస్ రహదారిని నిర్మిస్తాం.మొదటిదశలో సంకిరెడ్డిపల్లిలో రూ.300 కోట్లతో ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాం. నూతన పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-28T19:17:40+05:30 IST