Minister Srinivas goud: ప్రధాని ఏ మొహం పెట్టుకుని పాలమూరు వస్తున్నారు?
ABN, First Publish Date - 2023-09-30T11:01:41+05:30
జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
మహబూబ్‌నగర్: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) స్పందించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు (ఆదివారం) పాలమూరుకు వస్తున్న ప్రధాని ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరుకు లక్ష లేదా 50 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా హామీ ఇచ్చి మరిచారో అదే వేదిక మీదకు ఏం ఉద్దరిద్దామని వస్తున్నారని నిలదీశారు. తెలంగాణ డబ్బులతో ప్రాజెక్టులు కట్టుకుంటాము కాని కృష్ణానదిలో నీటివాట తేల్చాలన్నారు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. మోడీ పాలమూరుకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో తెలంగాణలో పాగావేయాలని బీజేపీ చూస్తోందని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బీజేపీ నాశనం చేయాలని చూస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-09-30T11:01:41+05:30 IST