Revanth Reddy: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్‌వి గొప్పలు తప్ప అభివృద్ధి ఏం చేయట్లేదు
ABN, First Publish Date - 2023-09-11T20:53:54+05:30
తన రాజకీయ ఎదుగుదలలో సీతా దయాకర్‌రెడ్డి(Sita Dayakar Reddy) ప్రతీసారి అండగా నిలబడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తన రాజకీయ ఎదుగుదలలో సీతా దయాకర్‌రెడ్డి(Sita Dayakar Reddy) ప్రతీసారి అండగా నిలబడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు గాంధీ భవన్(Gandhi Bhavan)లో మాణిక్ రావు ఠాక్రే , రేవంత్‌రెడ్డిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కుమారులు కొత్త కోట సిద్ధార్థరెడ్డి , కార్తీక్‌రెడ్డి పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు కాంగ్రెస్(Congress) కండువా కప్పుకున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజక వర్గాల నుంచి గాంధీ భవన్‌కు నాయకులు, అనుచరులు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘గతంలో నేను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్‌రెడ్డి అండగా నిలబడ్డారు. టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు 2009లో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించారు.అప్పుడు కేసీఆర్(KCR) గెలుపులో సీతా దయాకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. పాలమూరు బిడ్డల తరపున నేను ప్రశ్నిస్తున్నా... ఈ జిల్లాకు కేసీఆర్ చేసిందేంటి..? పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Project)ను ప్రారంభిస్తున్నామని గొప్పలు చెబుతున్నారు.
31 పంపుల్లో కేవలం ఒక్క పంపుతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదు.. జిల్లాలో అభివృద్ధి జరగలేదు. సీతా దయాకర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న వారు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప దేవరకద్ర అభివృద్ధి ఎమ్మెల్యేకు పట్టడంలేదు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలను పడావు పెట్టారు. పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. సీతక్కను రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుంది.మహబూబ్ నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయం. ఈనెల 16,17,18వ తేదీల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జునఖర్గే, జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 17వ తేదీన తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే ‘‘విజయ భేరి’’కి భారీగా తరలిరావాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2023-09-11T23:10:44+05:30 IST