ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS BJP: మోదీ సభలో కనిపించని బీజేపీ ముఖ్యనేతలు.. గట్టు దూకడం ఖాయమా?

ABN, First Publish Date - 2023-10-02T04:14:42+05:30

కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీలపై ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు. ‘తెలంగాణ యువత, మహిళలు, రైతులు మోదీ గ్యారంటీలనే నమ్ముతారు.

  • సభకు రాజగోపాల్‌, వివేక్‌, విజయశాంతి దూరం

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీలపై ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు. ‘తెలంగాణ యువత, మహిళలు, రైతులు మోదీ గ్యారంటీలనే నమ్ముతారు. ఎందుకంటే ఇచ్చిన గ్యారంటీలను మోదీ అమలు చేస్తారు కాబట్టి..’ అని ప్రకటించారు. మరోవైపు, ప్రధాని పర్యటనకు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉన్నారు. పార్టీ మార్పుపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్‌ కూడా మోదీ పర్యటనకు హాజరు కాలేదు.

తెలంగాణకు నేను గ్యారెంటీ

  • రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

  • ఎన్నికల తర్వాత బీజేపీ సర్కారే వస్తుంది

  • బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు

  • కరప్షన్‌.. కమీషన్‌ మాత్రమే ఆ పార్టీల పాలసీ

  • రైతు పథకాల పేరిట దోపిడీ చేస్తున్న బీఆర్‌ఎస్‌

  • మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రైతులు, మహిళలు, యువత బీజేపీని ఆదరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలపరిచారని తెలిపారు. మోదీపై నమ్మకమే ఇందుకు కారణమన్నారు. మోదీ గ్యారెంటీ ఇస్తే చేసి చూపిస్తారన్నది వారి నమ్మకమని, తెలంగాణకు తాను గ్యారెంటీ అని పేర్కొన్నారు. ప్రజల ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే.. రాష్ట్రంలో మార్పు తథ్యమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అవినీతి ప్రభుత్వం కాకుండా.. నిజాయితీ కలిగిన సర్కారు కావాలని, మోసపూరిత వాగ్దానాలు కాకుండా.. చెప్పింది చేసే ప్రభుత్వం కావాలని, అందుకు బీజేపీయే రావాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చారని అన్నారు. ఎన్నికల తర్వాత వారు కోరుకుంటున్న (బీజేపీ) సర్కారు ఏర్పాటవుతుందని చెప్పారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 2014 వరకు తెలంగాణలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే.. గడచిన 9 ఏళ్లలోనే తమ ప్రభుత్వం 2,500 కి.మీ. నిర్మించిందని తెలిపారు. ప్రతి చిన్న నగరం, గ్రామం నుంచి పట్టణం వరకు రహదారులు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు.

అవి రెండూ కుటుంబ పార్టీలు..

బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు అని ప్రధాని మోదీ ఆరోపించారు. కరప్షన్‌, కమీషన్‌ వాటి పాలసీ అని అన్నారు. తెలంగాణలో అధికార పార్టీ స్టీరింగ్‌ మరొకరి చేతిలో ఉందని చెప్పారు. సర్కారును ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసునంటూ ఎంఐఎం అధినేత ఒవైసీపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు. రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కరప్షన్‌, కమీషనే వాటి సిద్ధాంతమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చివేశాయని, కుటుంబం కోసం పనిచేయడమే వాటి లక్ష్యమని ఆరోపించారు. పార్టీలను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చివేశాయని, ఆ కంపెనీలకు అధ్యక్షుడు, సీఈవో, జనరల్‌ మేనేజర్‌ అందరూ కుటుంబ సభ్యులే ఉంటారని అన్నారు బీజేపీ మాత్రం సామాన్యుడి గురించి ఆలోచిస్తుందన్నారు.

రైతు పథకాల పేరిట బీఆర్‌ఎస్‌ దోపిడీ..

రైతు పథకాల పేరిట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట ఆర్భాటం చేసినా రైతులకు నీరందడం లేదని, రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. దీంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. 2014 వరకు తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీస మద్దతు ధర కింద రూ.3,400 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ.. తాము ఒక్క సంవత్సరంలోనే ఈ మొత్తానికి 8 రెట్లు (రూ.27 వేల కోట్లు) వెచ్చించామని తెలిపారు. రైతుల కోసం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్నారు. పీఎం కిసాన్‌ యోజన కింద రూ.10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. తెలంగాణ హస్తకళలకు, నైపుణ్యాలకు నిలయమని, ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు.

పసుపుబోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు..

తెలంగాణలో పసుపు రైతుల అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎగుమతులకు అనువైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక ములుగు జిల్లాలో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇందుకోసం రూ.900 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలైౖన సమ్మక్క-సారక్క పేరిట ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి భూమి ఇవ్వడానికి ఐదేళ్లుగా జాప్యం చేస్తోందని, ఆదివాసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విమర్శించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఎమినెన్స్‌’గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. దేశంలో 2014లో గ్యాస్‌ కనెక్షన్లు 14 కోట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 32కోట్లకుపైగా ఉన్నాయని తెలిపారు. గ్యాస్‌ పంపిణీ వ్యవస్థను విస్తరించాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. తాను ఇక్కడికి వచ్చే ముందు స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నానని, దేశ ప్రజలంతా ఒక గంట సమయం ఇందుకు కేటాయించాల్సిందిగా కోరానని తెలిపారు.

వీరవనితలు ఏలిన గడ్డ..

రాణి రుద్రమ వంటి వీర వనితలు ఏలిన గడ్డ తెలంగాణ అని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్లతో ఇప్పుడు పార్లమెంటులోనే కాకుండా.. అసెంబ్లీల్లో కూడా మహిళల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. మహిళలు మోదీని బలపరిచారని, మోదీ వారికి సాధికారత కల్పించారని తెలిపారు. వారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వ్యక్తిగత మరుగుదొడ్లు, ముద్ర యోజన, పీఎం ఆవాస్‌ యోజన, గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T11:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising