వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Dec 20 , 2023 | 11:02 PM
ఆదిశిలా క్షేత్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- వైకుంఠ ద్వారం, అన్నదానం షెడ్డు ప్రారంభం
మల్దకల్, డిసెంబరు 20 : ఆదిశిలా క్షేత్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆలయ వైకుంఠ ద్వారా లతో పాటు, అన్నదానం షెడ్డును బుధవారం తంబి హళ్లి పీఠాధిపతి విద్యాసింధు మాధవ తీర్థులతో కలిసి ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో మాజీ ఎంపీపీ, బీఆర్‌ఎస్ నాయకుడు సత్యారెడ్డి వారి తల్లిదండ్రులు వెంకటమ్మ, చిన్న వెంకటరెడ్డిల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డును ప్రారంభించారు. అంతకు ముందు వారికి ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యశ్చంద్రారెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారాలలో మొదటిది బాణాల శేషఫణి, నాలుగవ ద్వారం శాంతినగర్ శివశివాని పాఠశాల యజమాన్యం సౌజ న్యంతో నిర్మించారు. కల్యాణ కట్టను గ్రామానికి చెందిన కృష్ణాజిరావు ఆర్థికసహకారంతో నిర్మించారు. ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మధు సూదన్‌రెడ్డి, తిమ్మారెడ్డి, భీమరాయుడు, చంద్రశేఖర్ రావు, బాబురావు, నాగరాజుశర్మ, మధు సూధనాచార్యులు, రవి పాల్గొన్నారు.