Chada Venkata Reddy: గౌరవెల్లి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు?
ABN, First Publish Date - 2023-10-13T14:32:14+05:30
సిద్దిపేట జిల్లా: 2007లో రూ. 1300 కోట్ల కేటాయింపుతో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత సీపీఐదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా: 2007లో రూ. 1300 కోట్ల కేటాయింపుతో గౌరవెల్లి ప్రాజెక్టు (Gauravelli Project)కు శంకుస్థాపన చేసిన ఘనత సీపీఐ (CPI)దని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ (CM KCR) ఎందుకు పూర్తి చేయలేదు?.. తమ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ఆశీర్వాద సభలతో ముందుకు వచ్చినా ముఖ్యమంత్రికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి కాలం చెల్లిందన్నారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)లను ఓడించడమే లక్ష్యంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో ఏకమై ముందుకెళ్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2023-10-13T14:32:14+05:30 IST