ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandanrao: దుబ్బాకలో అభివృద్ధికి ఆటంకాలు బాధాకరం

ABN, First Publish Date - 2023-07-15T13:21:53+05:30

దుబ్బాక అభివృద్ధి విషయంలో కొందరు నాయకులు అడుగడుగునా ఆటంకాలు కల్పించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దుబ్బాక అభివృద్ధి విషయంలో కొందరు నాయకులు అడుగడుగునా ఆటంకాలు కల్పించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... 2016లో సీఎం దుబ్బాకకు వచ్చినప్పుడు ఫైర్ స్టేషన్ కొరకు ఒక ఎకరం భూమి రైతు ఇస్తే ఇంతవరకు ఎలాంటి నిర్మాణం లేదని ఆవేదన చెందారు. సాక్షాత్తు సీఎం చెప్పిన మున్సిపల్ భవనానికి కూడా అతీగతీ లేదంటే అర్థం వీరి కపట ప్రేమ అర్థం చేసుకోవచ్చన్నారు. గజ్వేల్, సిద్దిపేటలో ఆగమేఘాల మీద భవనాలు నిర్మించారని.. దుబ్బాక‌లో ఎందుకు నిర్మించరని ప్రశ్నించారు. సిద్దిపేటలో విపంచి, గజ్వేల్‌లో మహంతి ఆడిటోరియం ఎట్లా పూర్తి చేశారు?.. దుబ్బాకలో ఎందుకు చేయడం లేదని నిలదీశారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు వచ్చి 16 నెలలు గడిచినా ఎలాంటి టౌన్ అభివృద్ధి చేస్తలేరు.. చేయనిస్తలేరని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఐఓసీ భవనాలు పూర్తి అయిన దుబ్బాకలో ఇంకా కాలేదన్నారు. ప్రతి పక్షాలు ఉన్న చోట ఒక న్యాయం పాలక పక్షం ఉన్న చోట ఒక న్యాయం దురదృష్టకరమన్నారు.

దుబ్బాకలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలని 2021లో టెండర్ అయితే ఇంతవరకు శిలాఫలకం వేస్తలేరు.. వేయనిస్తలేరని విమర్శించారు. దుబ్బాక అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారో బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్మశానవాటికలకు మూడు కోట్లు ఖర్చు చేసారు కానీ దుబ్బాకలో ఒక లైబ్రరీకి రెండు కోట్లు పెట్టలేకపోతున్నారన్నారు. టీయుఎఫ్ఐడీసీ రూ.20 కోట్ల నిధులలో కుల సంఘాల భవనాలు, స్మశాన వాటికలకే ఖర్చు పెట్టడం బాధాకరమన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి రావలసిన నిధులు, పెండింగ్ భవనాలు, అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు లేఖ రాశారు. దుబ్బాక మీద ప్రేమ ఉంటే, ఉప ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-15T16:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising