BRS: పటాన్‌చెరు టికెట్‌పై కేసీఆర్ పునరాలోచించాలి: బీసీ బహుజన నేతలు
ABN, First Publish Date - 2023-08-23T16:05:18+05:30
పటాన్‌చెరు బీఆర్ఎస్ టికెట్(Patancheru BRS Ticket)పై కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు(BC Bahujan leaders) కోరారు.
పటాన్‌చెరు: పటాన్‌చెరు బీఆర్ఎస్ టికెట్(Patancheru BRS Ticket)పై కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు(BC Bahujan leaders) కోరారు. బుధవారం నాడు బీసీ వర్గాల నేత నీలం మధు(Neelam Madhu)కు పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ ఇస్నాపూర్ నుంచి చౌరస్తా వరకు సబ్బండ వర్గాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీల ఐక్యత వర్ధిల్లాలి, సబ్బండ వర్గాల నాయకులకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో పాలన కొనసాగిస్తున్నానని చెపుతున్న కేసీఆర్(KCR) బీసీ వర్గాల నాయకులకు టికెట్ కేటాయింపులో చిన్న చూపు చూడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా వాడుకుంటూ బహుజన వర్గాల నాయకులని తొక్కి పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ కులాలైన ముదిరాజ్‌లు , నాయిని బ్రాహ్మ, రజక ఇతర బీసీ కులాల వారికి సీట్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.
గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజలందరికీ అండగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని విస్తృతంగా ప్రజలల్లోకి తీసుకెళ్లిన నీలం మధుకు టికెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు. 60 లక్షల ఓట్లు ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం భావ్యం కాదన్నారు.10 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 58 సీట్లు ఇస్తే.. బీసీ వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వాలో మీరే ఆలోచించుకోవాలని హితవు పలికారు. వెంటనే బీఆర్ఎస్ అధిష్ఠానం పటాన్‌చెరు టికెట్‌పై పునరాలోచన చేసి బహుజన నాయకుడు నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీలంతా ఏకమై సత్తా చూపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మన రజక సంఘం ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటేష్, చాకలి సంజీవ్, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గారెల శ్రీను ముదిరాజ్,లక్ష్మారెడ్డి, దానయ్య , వడ్డెర వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, గౌరి చారి, మల అనిల్,మురళి యాదవ్,సబ్బండ వర్గాల నాయకులు, మద్దతుదారులు,తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-23T16:05:18+05:30 IST