Mainampally: మెదక్‌కు పట్టిన శని మంత్రి హరీష్‌రావు
ABN, First Publish Date - 2023-10-14T17:57:55+05:30
బీఆర్ఎస్ నేతలు.. రోజుకో నేత ఇంటికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(MLA Mainampally Hanmantha Rao) ఎద్దేవ చేశారు.
మెదక్: బీఆర్ఎస్ నేతలు.. రోజుకో నేత ఇంటికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(MLA Mainampally Hanmantha Rao) ఎద్దేవ చేశారు. శనివారం నాడు మెదక్‌లోని బాలాజీ గార్డెన్‌లో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ..‘‘ మంత్రి హరీశ్‌రావుకి మెదక్ జిల్లాలో ఏం పని ఉంటుంది. పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతలు డబ్బులు తరలిస్తున్నారు. మెదక్‌కు పట్టిన శని మంత్రి హరీష్‌రావు. బ్రిటిష్ పాలనలోనే మెదక్ జిల్లా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ సిద్దిపేట జిల్లా సాధించుకున్నారు. మెదక్‌లోని కార్యాలయాలను సిద్దిపేటకు మంత్రి హరీశ్‌రావు తరలించారు.
గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడినందుకు ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు రాలేవు. రెండుసార్లు పేపర్ లీకేజీ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 310 జీఓ రద్దు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 27 శాతం పీఆర్సీ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ఉంది. కంఠంలో ఊపిరున్నంత వరకు సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం. మీరు చేసిన పనులు చెప్పండి.. నేను చేసిన పనుల్లో ఒక్క శాతం ఎక్కువ చేసిన రాజకీయాలు వదిలేస్తా’’ అని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.
Updated Date - 2023-10-14T17:57:55+05:30 IST