T.Minister: అర్చకులకు దూపదీప నైవేద్యం పథకం పత్రాలను అందజేసిన మంత్రి హరీష్‌రావు
ABN, First Publish Date - 2023-06-21T10:49:00+05:30
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
సిద్దిపేట: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజల్లో మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... 171 మంది పూజారులకు ధూప దీప నైవేద్యం మంజూరు పాత్రలు అందజేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ 1990లో బ్రహ్మ యజ్ఞం చేశారని గుర్తుచేశారు. కొండగట్టు, ధర్మపురి లక్ష్మీనరసంహస్వామి, యాదాద్రి, కొండపోచమ్మ, కొమురవెల్లి మల్లన్న స్వామి ఇలా ఎన్నో ఆలయాలు అభివృద్ధి చేశారన్నారు. జీర్ణ దేవాలయాల పునరుద్దరణ పనులు 40 కోట్లతో జరగుతున్నాయని మంత్రి తెలిపారు.
కొనయపల్లి వెంకటేశ్వర స్వామి గుడిని గొప్పగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. 2500 దేవాలయాలు కొత్త ధూప దీప నైవేద్యంలోకి తెచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ 6 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచారన్నారు. గతంలో 1805 దేవాలయాలకు రూ.500 ఇచ్చేవారని చెప్పారు. 2500 కలిపి 6441 దేవాలయాలకు ప్రతి నెల 10 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు... దీని కోసం ప్రభుత్వం ప్రతీనెల రూ.77 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 33 జిల్లాలలో మన సిద్దిపేటకు 171 సాంక్షన్లు రావడం సంతోషకరమన్నారు. ఎక్కడ ధూప దీప నైవేద్యం ఉంటుందో అక్కడ అంతా శుభం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను, మన ప్రభుత్వాన్ని అంతా దీవించాలని మంత్రి హరీష్‌రావు కోరారు.
Updated Date - 2023-06-21T10:49:00+05:30 IST