ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Prabhakar: క్రైస్తవుల హక్కులను కాపాడుతాను

ABN, Publish Date - Dec 23 , 2023 | 04:09 PM

క్రైస్తవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) పేర్కొన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు.

సిద్దిపేట జిల్లా: క్రైస్తవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) పేర్కొన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ... అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్ని అమలు చేస్తాం. హుస్నాబాద్‌లోని మోడల్ స్కూల్ లో విద్యార్థులకు కారం పెట్టిన ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజ్, ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, భూ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషి చేస్తానని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. 24 గంటలు నియోజర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 04:09 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising