ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: వారి త్యాగాల ఫలితమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ABN, First Publish Date - 2023-05-08T15:20:32+05:30

సిద్దిపేట జిల్లా: తొగుట మండలం, రాంపూర్ కోటిలింగాల దేవాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా: తొగుట మండలం, రాంపూర్ కోటిలింగాల దేవాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy), ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ (MLC Farooq Hussain), జెడ్పీ ఛైర్ పర్సన్ రోజాశర్మ (Roja Sharma) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తొగుట మండల ప్రజల త్యాగాల ఫలితమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు (Mallanna Sagar Project) వచ్చిందన్నారు. తొగుటలో వంద శాతం రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించానన్నారు. కానీ ఏది చేసిన తానే చేశానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (BJP MLA Raghunandan Rao) చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏది పడితే అది అబద్ధాలు చెప్పడం రఘునందన్‌కు అలవాటని అన్నారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో రఘునందన్ రావు ఎందుకు అడగలేదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ గడ్డమీద బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి రాదని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. దుబ్బాక గడ్డమీద లక్ష మెజారిటీతో గులాబీ జెండా ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కార్యకర్తలకు ఎవ్వరికీ ఏ ఆపదున్నా ఆదుకుంటానన్నారు. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక మొదటి వరుసలో ఉన్నదనేది మరువకూడదన్నారు. రైతుల కోసం కృషి చేసేదే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దుబ్బాక ప్రజలు ఆశీర్వదిస్తే పక్క నియోజకవర్గాలను తలదన్నే విధంగా దుబ్బాకను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ టూరిజంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును చేసుకుందామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-05-08T15:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising