ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandan Rao: మంత్రి హరీశ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ABN, First Publish Date - 2023-10-03T19:59:07+05:30

ప్రధానమంత్రి ఫ్లెక్సీని చించేసిన మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఈ దేశ ప్రజలకు , సిద్దిపేట జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు.

సిద్దిపేట: ప్రధానమంత్రి ఫ్లెక్సీని చించేసిన మంత్రి హరీష్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఈ దేశ ప్రజలకు , సిద్దిపేట జిల్లా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేట నుంచి గజ్వేల్‌కు చేరుకున్న ప్యాసింజర్ రైల్ చెరుకుంది. రైలు‌లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గజ్వేల్ వరకు రైలులో వచ్చారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుల హోరహోరి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా నిజామాబాద్ నుంచి రైలును ప్రారంభిస్తే బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేటలో వాళ్ల పార్టీ కార్యక్రమం లాగా మంత్రి హరీష్‌రావు వ్యవహరిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వ్యవహరించారని.. మోదీ ఫొటో ఉన్న ఫెక్సీని చింపేశారని, టీవీ మానిటర్‌లో వస్తున్న వర్చువల్ వీడియోను కనడబకుండా టీవీని తన్నారు. ఈ ఇద్దరిపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేయాలి. ఇదేనా మీ పార్టీ సంస్కారం. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అహంకారానికి తెలంగాణ సమాజం తప్పకుండా సమాధానం ఇస్తది. మేము కచ్చితంగా పార్టీ పరంగా ఈ సంఘటనను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి, నరేంద్ర మోదీ దృష్టికి, పార్లమెంట్ ఫ్రీ విలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తా’’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T19:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising