Ramulu Naik: కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం
ABN, First Publish Date - 2023-09-02T17:48:14+05:30
సీఎం కేసీఆర్(CM KCR) కుటుంబ పాలనకు చరమగీతం పాడి ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మల్సీ రాములు నాయక్(Ramulu Naik) పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఆర్(CM KCR) కుటుంబ పాలనకు చరమగీతం పాడి ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మల్సీ రాములు నాయక్(Ramulu Naik) పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని అరికట్టడానికి అంతా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 1200మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలలో కొంతమందికి మాత్రమే అటెండర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 550మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి మిగిలినవారికి మొండి చెయ్యి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర పాలన పెత్తనం కంటే తెలంగాణ పెత్తనం ఎక్కువైందని రాములు నాయక్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-02T18:02:34+05:30 IST