ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Elections 2023 : కారులో జగ్గారెడ్డికి సీటు.. ఫస్ట్ లిస్టులో పేరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!

ABN, First Publish Date - 2023-08-19T15:26:59+05:30

తెలంగాణలో ప్రస్తుతం సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. పీసీసీ నేతలంతా అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం గాంధీభవన్‌ వైపే చూడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్‌‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. పీసీసీ నేతలంతా అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం గాంధీభవన్‌ వైపే చూడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్‌‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని పీసీసీ అధ్యక్షుడిగా చేసినప్పటినుంచీ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పలుమార్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మీడియా వేదికగా గరం గరం అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా సొంత పార్టీ వాళ్లతో కాకుండా అధికార పార్టీ నేతలతోనే కలిసి తిరిగారు. ఇక మంత్రి కేటీఆర్-జగ్గారెడ్డి ప్రత్యేకంగా కలుసుకుని ముచ్చటించుకున్న వీడియోలు కూడా మీడియాలో ప్రచారం అయ్యాయి. పైగా పార్టీ మార్పుపై మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నా... ఏ రోజూ కూడా జగ్గారెడ్డి ఖండించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ పరిణామాలతో ఆయన పార్టీ మారడం ఖాయమని పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది.

హోల్డ్‌లో ఉంచిన బీఆర్ఎస్

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ (CM Kcr) విడుదల చేయనున్న బీఆర్ఎస్ తొలి అభ్యర్థుల జాబితాలో సంగారెడ్డి అభ్యర్థిని హోల్డ్‌లో ఉంచినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ సీటు జగ్గారెడ్డి కోసమే పెండింగ్‌లో పెట్టినట్లుగా చర్చ నడుస్తోంది. మరోవైపు జగ్గారెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకోవద్దంటూ సంగారెడ్డి గులాబీ నేతలు పార్టీ హైకమాండ్‌‌ను కోరినట్లు తెలుస్తోంది.

రంగంలోకి కాంగ్రెస్ దూత..

జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఏఐసీసీ కూడా అప్రమత్తమైంది. దీంతో పార్టీ దూతలను రంగంలోకి దింపింది. జగ్గారెడ్డి పార్టీ మారకుండా చూసే బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం జగ్గారెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో జగ్గారెడ్డి ఏం మాట్లాడబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Updated Date - 2023-08-19T15:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising