ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao : గజ్వేల్ ప్రయోగ శాలగా మారింది

ABN, First Publish Date - 2023-10-03T15:46:32+05:30

గజ్వేల్ ఒక ప్రయోగ శాలగా మారిందని.. నియోజకవర్గాన్ని ప్రజలు గర్వించే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారని మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) వ్యాఖ్యానించారు.

సిద్దిపేట: గజ్వేల్ ఒక ప్రయోగ శాలగా మారిందని.. నియోజకవర్గాన్ని ప్రజలు గర్వించే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారని మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) వ్యాఖ్యానించారు. గజ్వేల్ పట్టణంలో 34 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 100 పడకలతో కూడిన అధునాతన మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎప్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ రోజు గజ్వేల్‌కు రైలు రాబోతుంది. గజ్వేల్ ప్రజలు ఇకపై రైల్లో కూడా ప్రయాణం చేయొచ్చు.

గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 530 కోట్ల రూపాయల పనులను ప్రారంభించుకున్నాం. గజ్వేల్ పట్టణంలో 100 పడకల నుంచి 350 పడకల ఆస్పత్రి తెచ్చుకున్నాం. గతంలో ప్రైవేటు ఆస్పత్రిలో 80 శాతంకు పైగా ప్రసూతి కేసులు వస్తుండేవి. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 20 శాతం కూడా ప్రసూతి కేసులు నమోదయ్యేవి కావు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికంగా 90 శాతంకు పైగా ప్రసూతి కేసులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే అవుతున్నాయి. సీఎం కేసీఆర్.. గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చారు. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడం సభభా, ఈ పార్టీలను ప్రజలు పాతాళంలోకి తొక్కాలి. గజ్వేల్‌కు పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మంజూరు వచ్చింది. గజ్వేల్‌లో కేసీఆర్ హాట్రిక్ ఖాయం, గజ్వేల్ మరింత డెవెలప్ అవ్వడం ఖాయం. టీపీసీసీ అంటే.. పేమెంట్ కలెక్షన్ సెంటర్‌గా మారింది, టికెట్లకు, అప్లికేషన్లకు లంచం తీసుకునే స్థాయికి కాంగ్రెస్ మారింది. తెలంగాణను ఆగం చేసే పార్టీల వెంట నడిస్తే మన బతుకులు కూడా ఆగం అవుతాయి’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T15:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising