కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister KTR: కాంగ్రెస్ నేతలు, ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు

ABN, First Publish Date - 2023-10-20T16:45:18+05:30

ఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.

Minister KTR: కాంగ్రెస్ నేతలు, ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.


"ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ కాళేశ్వరం కట్టుకున్నాం. కేసీఆర్ తమను కంటికి రెప్పలా కాపాడుకుంటారని రైతులు భావిస్తున్నారు. రైతు రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పూర్తవుతుంది. రాహుల్ మమ్మల్ని దొరల పాలన అంటున్నారు. రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి రాచి రంపాన పెట్టారు. వాళ్ళు కూడా దొరల పాలన అనడమా. 70 అధికారంలో ఉండి కాంగ్రెస్ నేతలు ఏం వెలగబెట్టారు. మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కన్నీళ్లు రెట్టింపు చేశారు. పాలమూరు లిఫ్ట్ లో ఒక్క మోటార్ నడిస్తేనే కాంగ్రెస్ నేతల కండ్లు మండుతున్నాయి. మొత్తం 31 మోటార్లు నడిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనే అంశం చాలా కీలకమైనది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు పాలమూరు ప్రజలకు తెలుసు. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు. మన కంటిని మనమే పొడుచుకోవద్దు." అని కేటీఆర్ అన్నారు.

Updated Date - 2023-10-20T16:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising