Talasani: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2023-07-21T20:06:04+05:30
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నగరంలోని ప్రస్తుత పరిస్థితులను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
"హుస్సేన్ సాగర్‌కు ఎగువ నుంచి భారీ ఎత్తున నీరు వస్తుంది. నీటి లెవెల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. దిగువకు నీటి విడుదల జరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలి. మరో 2, 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని స్థాయిలలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలి." అని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎఫ్టీఎల్ 513. 41 మీటర్లు కాగా.. 513.62 మీటర్లకు సాగర్ నీటిమట్టం చేరింది. హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. 3 తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు నీళ్లను వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-07-21T20:07:05+05:30 IST