MLA: ‘రైతుబంధు’పై విషం చిమ్ముతున్న కాంగ్రెస్..
ABN, First Publish Date - 2023-10-28T08:46:28+05:30
ఎన్నో కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ప్రవేశపెట్టిన రైతుబంధు
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఎన్నో కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) ఆరోపించారు. ఫిలింనగర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సొమ్మును, పన్నుల ద్వారా కట్టే పైసలను కేసీఆర్ రైతులకు రైతుబంధు రూపంలో ఇస్తూ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. దీంతో పాటు రైతుబంధు డబ్బులు వేయొద్దు అంటూ కాంగ్రెస్ నేతలు మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Revanth Reddy, Uttam Kumar Reddy), తదితరులు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడం బట్టి చూస్తే వారికి రైతులపై ఎంత కక్ష ఉందనే విషయం బయట పడిందన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల ఉచిత కరెంట్ మాత్రమే చాలు అని వ్యాఖ్యానించారని, ఇటీవల రైతుబంధును ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసి మరోసారి రైతుల ఉసురు పోసుకుంటున్నదని మండిపడ్డారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ నేతల మాటలు, వ్యవహార శైలి చూస్తుంటే రాష్ట్రంలోని ప్రజలు మొత్తం వారిని ఈసడించుకున్నారని ఆరోపించారు. పేదల కోసం పనిచేస్తున్న బీఅర్‌ఎస్ ప్రభుత్వానికి, పేదలంటే ద్వేషం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మధ్యన తేడా స్పష్టంగాఉందన్నారు..
Updated Date - 2023-10-28T08:46:28+05:30 IST